భారత్‌లో మహిళల చాంపియన్స్ ట్రోఫీ
- ఆతిథ్య హక్కులు ఖరారు చేసిన ఐసీసీ
- ముంబై, వడోదర వేదికలుగా టోర్నీ
దుబాయి, సెప్టెంబర్ 2 : మహిళల క్రికెట్(Womens Cricket,)లో ప్రతిష్టాత్మక టోర్నీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Troph)కి భారత్ ఆతిథ్యం(India hosting) ఇవ్వబోతోంది. వాస్తవానికి ఈమెగా టోర్నీని శ్రీలంక(Sri Lanka)లో నిర్వహించాలని ముందుగా నిర్ణయించారు. అయితే శ్రీలంక క్రికెట్ బోర్డు(Sri Lanka Cricket Board)లో నెలకొన్న పరిస్థితులు, ఐసీసీ సూచించిన సంస్కరణల అమలులో జాప్యం కారణంగా ఈటోర్నీని అక్కడి నుంచి భారత్‌కు తరలించారు. ఈమేరకు ఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ప్రత్యామ్నాయ వేదిక కోసం భారత్ తో పాటు బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాలను పరిశీలించిన ఐసీసీ బోర్డు ఇండియాకే ఓటు వే సింది. 2027 ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా, వడోదర ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈమ్యాచ్‌లు జరగనున్నాయి. ఈనిర్ణ యంతో భారత అభిమానులకు స్వదేశంలో మరో మెగా ఈవెంట్ చూసే అవకాశం ద క్కింది. రౌండ్‌రాబిన్ ఫార్మాట్ ఈప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ పూర్తిగా టీ20 ఫా ర్మాట్‌లో జరగనుంది.
ఆతిథ్య భారత్‌తో పా టు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు ఇందులో తలపడతాయి. లీగ్ దశలో ప్రతి జట్టు మిగతా అన్ని జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. పా యింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫిబ్రవరి 28న జరిగే ఫైనల్ నేరు గా అర్హత సాధిస్తాయి. శ్రీలంక ఆతిథ్య హక్కు లు కోల్పోయినా, టోర్నీలోఆడే అవకాశాన్ని మాత్రం దక్కించుకుంది. ఈటోర్నీ మహిళల క్రికెట్లో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని ఐసీసీ చైర్మన్ జైషా వ్యాఖ్యానించారు.






