8 June, 2026 | 2:45 AM

గాండ్ల కుల జిల్లా అధ్యక్షునిగా శ్రీనివాస్

08-06-2026 01:10 AM

వెంకటాపూర్, జూన్ 7 (విజయక్రాంతి): అఖిల గాండ్ల తెలికుల సంఘం ములుగు జిల్లా అధ్యక్షునిగా నర్సాపూర్ గ్రామానికి చెందిన పిల్లలమర్రి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం పాలంపేట గ్రామంలో గల ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం, యునెస్కో గుర్తింపు పొంది ప్రముఖ క్షేత్రంగా విరాజిల్లుతున్న రామప్ప దేవాలయం గార్డెన్ లో జిల్లా కులస్తులందరూ సమావేశమై జిల్లా కమిటీని ఎన్నుకున్నారు.

రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బొల్లెపల్లి అన్నపూర్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు పిల్లలమర్రి రాము ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికలలో గాండ్ల కుల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా గనిశెట్టి రాజు, కార్యనిర్వాహక అధ్యక్షులుగా సర్వ వెంకయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కుల అభివృద్ధి కోసం తమ శాయా  శక్తుల కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పిల్లలమర్రి శివ, సతీష్, సమ్మయ్య, భద్రయ్య శ్రీనివాస్, బిక్షపతి, సర్వ సాంబయ్య, రాజు, శివుడు, ఉమా, స్రవంతి. జగదాంబ, స్వరూప, హాసిని, అక్షయ్, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.