8 June, 2026 | 2:21 AM

కువైట్‌లో తాడ్వాయి వాసి మృతి

08-06-2026 01:11 AM

తాడ్వాయి, జూన్, 7(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడువాయి మండల కేంద్రానికి చెందిన దమ్మన్నగారి సాయిరెడ్డి(56) కువైట్ లో గుండెపోటుతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన సాయి రెడ్డి గత కొన్ని సంవత్సరాల నుంచి కువైట్ దేశంలో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన చాలా సంవత్సరాల నుంచి కువైట్ దేశంలోనే విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని  పోషించుకుంటున్నారు. 

అకస్మాత్తుగా ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు వారు తెలిపారు.మృతుడికి భార్య శిరీష, కుమారుడు సుభాష్ రెడ్డి లు ఉన్నారు. ప్రభుత్వం స్పందించి సాయి రెడ్డి మృతదేహాన్ని  తొందరగా స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని గ్రామ స్తులు కోరుతున్నారు. సాయి రెడ్డి మృతి చెందడంతో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.