08-12-2025 07:37:29 PM
వృద్ధురాలు యోగక్షేమాలు తెలుసుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు
మంథని,(విజయక్రాంతి): అవ్వ బాగున్నావా... అంటూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆప్యాయంగా పలకరించి వృద్ధురాలి యోగక్షేమాలు తెలుసుకున్నారు. సోమవారం మహదేవ్పురు మండలంలోని బెగ్లూర్ గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి జాతరలో పాల్గొన్న శ్రీనుబాబు దేవుడి దర్శనం అనంతరం అక్కడికి వచ్చిన ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడారు. వృద్ధుల తో ప్రత్యేకంగా మాట్లాడి వారి యుగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.