22 July, 2026 | 1:59 AM

బాలాపూర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరాములు

22-07-2026 12:00 AM

బడంగ్‌పేట్, జులై 21 (విజయక్రాంతి): జి హెచ్‌ఎంసి బ డంగ్‌పేట్ సర్కి ల్ బాలాపూర్ 62వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్.శ్రీరాములు నియమితులైనారు. పలు డివిజన్లకు అధ్యక్షులుగా నియమిస్తూ.. టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. బాలాపూర్ డివిజన్ అధ్యక్షుడిగా నియమితులైన శ్రీరాము లు మాట్లాడుతూ.. పార్టీ అధిష్టానం నా సేవలను గుర్తించి నాకు అవకాశం కల్పించిన పార్టీ పెద్దలకు,

అందుకు సహాయ సహకారాలు అందించిన స్థానిక నాయకులకు పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. డివిజన్ అధ్యక్షుడిగా నాపై మరింత బాధ్యత పెరిగిందని, పార్టీ నాయకత్వం సూచనలు సలహాల మేరకు బాలాపూర్ డివిజన్ ప్రతి కాంగ్రెస్ నాయకుని సహకారంతో పార్టీ బలోపేతం కోసం తగిన కృషి చేస్తానని అన్నారు.