calender_icon.png 10 January, 2026 | 8:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెయింట్ పాల్స్ 40వ క్రీడోత్సవం

09-01-2026 12:00:00 AM

కరీంనగర్, జనవరి 8 (విజయక్రాంతి): వావిలాలపల్లి కరీంనగర్‌లోని సెయింట్ పా ల్స్ హైస్కూల్‌లో 40వ వార్షిక స్పోర్ట్స్ మీ ట్ 2026ను నర్సరీ నుంచి మూడో తరగతి విద్యార్థులతో నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉడాన్ మీ కలలకు రెక్కలు ఇవ్వండి అనే నినాదంతో జరిగింది. పాఠశాల ప్రిన్సిపాల్, కారస్పాండెంట్ లీనా ప్రియదర్శిని నాయకత్వంలో చైర్మన్ రాజ్ కుమార్ మార్గదర్శకత్వంలో నిర్వహించారు. క్రీడలు విద్యా ర్థుల శారీరక, మానసిక అభివృద్ధికి ఎంతో దోహదపడతాయన్నారు.  రన్నింగ్ రేస్, సాక్ రేస్, ఫ్రాగ్ జంప్, స్కిప్పింగ్, మ్యూజికల్ చెయర్స్, కోన్ బ్యాలెన్సింగ్, రిలే రేస్, స్పుడర్ వాక్, బెలూన్ బ్యాలెన్సింగ్, త్రీ లెగ్డ్ రేస్ వంటి అనేక క్రీడా పోటీలు నిర్వహించారు.