26 August, 2026 | 12:13 AM

సకాలంలో స్పందించి ప్రాథమిక చికిత్స అందించిన '108' సిబ్బంది

25-08-2026 10:54 PM

చుంచుపల్లి,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ కుమారుడు కె. సాక్షిత్ (13) ప్రమాదవశాత్తు ఇంటి దగ్గర జారి కింద పడటంతో అతని కుడికాలు విరిగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 అత్యవసర రవాణా సేవలకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే 108 ఈఎమ్‌టీ  స్రవంతి, పైలట్ సాంబశివరావు సంఘటనా స్థలానికి చేరుకుని బాలుడికి ప్రాథమిక చికిత్స ప్రారంభించారు.

ఈ ఆర్సీపి వైద్యులు డాక్టర్ మనీష్ సూచనల మేరకు బాలుడికి పీసీఎం  ఇంజెక్షన్ అందించి, నొప్పి తగ్గించేలా చర్యలు తీసుకున్నారు.  కాలు కదలకుండా కుడికాలుకు లాంగ్ స్ప్లింట్స్ తో కట్టుకట్టి ఉపశమనం కలిగించారు. అనంతరం బాలుడిని మెరుగైన వైద్య సేవల కోసం కొత్తగూడెం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. అత్యవసర సమయంలో వేగంగా స్పందించి మెరుగైన ప్రాథమిక వైద్యం అందించిన ఈఎమ్‌టీ స్రవంతి, పైలట్ సాంబశివరావులకు బాలుడి కుటుంబ సభ్యులు ,గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.