24 July, 2026 | 3:25 AM

మెల్లచెరువు చౌరస్తాలో మురుగు నిల్వ స్థానికులకు తప్పని ఇబ్బందులు

24-07-2026 12:00 AM

గద్వాల టౌన్, జూలై 23 : గద్వాల పట్టణంలోని మెల్లచెరువు చౌరస్తా నుంచి మెల్లచెరువు, పిల్లిగుండ్ల కాలనీకి వెళ్లే ప్రధాన రహదారిపై నాలుగు రోజులుగా మురుగునీరు నిల్వ ఉండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుర్వాసనతో పాటు రాకపోకలకు ఆటంకం ఏర్పడటంతో విద్యార్థులు, మహిళలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.సమస్యపై పలుమార్లు ఫిర్యాదు చేసినా శాశ్వత పరిష్కారం చూపలేదని స్థానికులు ఆరోపించారు.

తాత్కాలికంగా రాకపోకలు సాగేందుకు రూ.6 వేల స్వంత ఖర్చుతో మట్టిని వేయించినట్లు తెలిపారు. ఈ విషయంపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ జానకిరామ్ సంబంధిత సిబ్బందితో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.