18 April, 2026 | 11:01 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట

30-06-2025 01:04 AM
  1. ముగ్గురు మృతి

పూరీ కలెక్టర్, ఎస్పీలపై బదిలీ వేటు

భక్తులకు క్షమాపణలు చెప్పిన ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్  మాఝీ

భువనేశ్వర్, జూన్ 29: ఒడిషాలోని గుండిచా దేవాలయంలో పూరీ జగన్నాథ యాత్ర సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో 50 మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం 4 మధ్య ఈ తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వారిని ప్రేమకాంత మొహంతి (80), బసంతి సాహూ (36), ప్రభాతి దాస్ (42)గా గుర్తించారు.

రథాలపై ఉన్న దేవతలను చూసేందుకు భక్తులు గుండిచా ఆలయం వద్దకు భారీగా చేరుకోవడంతో ఈ తొక్కిసలాట ఘటన చోటు చేసుకుందని పూరీ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ తెలిపారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. 

పూరీ కలెక్టర్, ఎస్పీ బదిలీ

పూరీ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వైన్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) విని త్ అగర్వాల్‌లను బదిలీ చేస్తూ ఒడిషా ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఖుర్దా జిల్లా కలెక్టర్ చంచల్ రాణా పూరీ జిల్లా కొత్త కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రభుత్వం పే ర్కొంది.

ఏడీజీ (క్రైమ్)గా ఉన్న పినాక్ మిశ్రా ఎస్పీగా చార్జ్ తీసుకుంటారని పేర్కొంది. తొ క్కిసలాట ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ భక్తులను క్షమాపణలు కో రారు. ఐదుగురు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.