10 May, 2026 | 8:20 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభించండి

11-12-2024 01:23 AM

కేంద్ర మంత్రిని కోరిన ఎంపీ కడియం కావ్య

జనగామ, డిసెంబర్ 10 (విజయక్రాంతి): వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్టు పనులు త్వరగా ప్రారంభించేలా చొరవ చూ పాలని ఎంపీ కడియం కావ్య కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయు డును కోరారు. మంగళవారం ఆమె ఢిల్లీలో మంత్రిని కలిశారు. మామునూరు ఎయిర్‌పోర్టును రెండేళ్లలో పూర్తి చేసి విమానాల రాకపోకలను ప్రారంభించాలని కోరారు.

మామునూరు ఎయిర్‌పోర్టు పునరుద్ధరణ లో భాగంగా భూసేకరణ కోసం రూ.205 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని ఆమె చెప్పారు. త్వరలోనే మామునూరు ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వచ్చేలా కృషి చేస్తానని మంత్రి రామ్మోహన్‌నాయు డు హామీ ఇచ్చినట్లు ఎంపీ కావ్య తెలిపారు.