calender_icon.png 16 October, 2025 | 4:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలి

16-10-2025 11:18:53 AM

చిట్యాల,(విజయక్రాంతి):  ఈ నెల 18 న  బీసీల రాష్ట్ర బందును విజయవంతం చేయాలని  బిజెపి నాయకుడు చికిలం మెట్ల అశోక్  గురువారం పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఈనెల 18న బీసీ ఐకాస నిర్వహించనున్న రాష్ట్ర బంద్ కు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని ఈ రాష్ట్ర బందులో పార్టీ శ్రేణులు, యువకులు, విద్యార్థులు, మహిళలు, విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, పెట్రోల్ బంకు యాజమాన్యాలు పూర్తిగా అన్ని   వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని  రాష్ట్ర బందును విజయవంతం చేయాలని  భారతీయ జనతా పార్టీ నాయకుడు, తెలంగాణ మలిదశ ఉద్యమ నేత చికిలం మెట్ల అశోక్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.