calender_icon.png 16 October, 2025 | 3:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీ నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలి

16-10-2025 11:16:35 AM

సమాచార హక్కు చట్టం ద్వారా ఫిర్యాదు చేసిన నందెల్లి అవినాష్

కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని 55వ డివిజన్ మంకమ్మతోట హానుమాన్ దేవాలయం, కమిటి హాల్ నిర్మాణ పనులకు సంబంధించి ఎంపీ ఫండ్ కింద మంజూరైన పది లక్షల రూపాయల దుర్వినియోగంపై మున్సిపల్ అధికారులు విచారణ జరపాలని బిఆర్ఎస్ నాయకుడు నందెల్లి అవినాష్ సమాచార హక్కు చట్టం ద్వారా ఫిర్యాదు చేశారు. 

55వ డివిజన్ పరిధిలో 2023, ఆగస్టు 25న కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు(Karimnagar Members of Parliament) ఎంపీ ఫండ్ క్రింద10 లక్షల రూపాయలతో హానుమాన్ దేవాలయం, కమ్యూనిటి హాల్ కోసం శంఖుస్థాపన చేశారు. కానీ ఇప్పటి వరకు దేవాలయం పనులు కానీ, కమ్యూనిటి హాల్ పనులు గానీ, మరే ఇతర పనులు ఇక్కడ జరగలేదన్నారు. ఎంపీ నిధుల కింద మంజూరైన పది లక్షల రూపాయలు ఏ పనుల కోసం వెచ్చించినారో తెలపాలని ఫిర్యాదులో కోరారు. ఈ నిధులపై మున్సిపల్ అధికారులు తగు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.