27న బక్రీద్ సెలవు
08-05-2026 12:00 AM
ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): బక్రీద్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మే 27వ తేదీని ప్రభుత్వ సెలవుగా ప్రకటించింది. అయితే చంద్రుని దర్శనంపై ఆధారపడి పండుగ తేదీ మారే అవకాశం ఉండటంతో సెలవు తేదీలో కూడా మార్పులు ఉండొచ్చని అధికారులు పేర్కొన్నారు. పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో పశువుల మార్కెట్లు సందడిగా మారనున్నాయి.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి వ్యాపారులు భారీగా పశువులను తీసుకురానున్నారు. ఖుర్బానీ కోసం జంతువుల కొనుగోళ్లకు ఈ మార్కెట్లు ప్రధాన కేంద్రాలు. మరోవైపు ఈద్‌ఛీ సందర్భంగా జూన్ 4న కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది.






