4 June, 2026 | 5:07 PM

అట్టహాసంగా స్టేట్ లెవల్ క్రికెట్ పోటీలు

04-06-2026 04:34 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణం తిలక్ గ్రౌండ్ లో కొడకండ్ల వైకుంఠం- ఉదయమ్మ  జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసిన స్టేట్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిగా TPCC రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరీ స్వామి, బెల్లంపల్లి ACP కిరణ్ కుమార్ హాజరయ్యి  టోర్నమెంట్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడారు. టోర్నమెంట్ నిర్వహకులు రఘు యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్ యూత్ కాంగ్రెస్ పట్టణ ఉపాధ్యక్షులు ఇమ్రాన్ వారి బృందాన్నీ అభినందించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఇలాంటి టోర్నమెంట్లను అధికం చేయాలన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గం నుండి అంతర్జాతీయ స్థాయిలో ఆడాలని ఆకాంక్షిచారు. ఆట  తొలిరోజు హాజీపూర్ పోలీస్ బెటాలియం టీమ్, పెద్దపల్లి జట్లు తలపడ్డాయి, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు  క్రీడాకారులు పాల్గొన్నారు.