4 June, 2026 | 5:07 PM

గ్రామస్తులకు సమాచారం ఇవ్వకుండానే గ్రామ సభ నిర్వహణ.?

04-06-2026 04:33 PM

మండిపడుతున్న గ్రామస్తులు.

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయిపేట గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామసభ కార్యక్రమానికి గ్రామస్తులకు ఎలాంటి సమాచారం లేదని ఒకరోజు ముందుగానే గ్రామంలో చాటింపు చేయించి గ్రామ ప్రజలకు తెలపడం జరుగుతుందని అలాంటి సమాచారం లేకుండానే గ్రామ సభ నిర్వహణ చేయడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. గ్రామంలో ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్న ఒకరోజు ముందుగానే గ్రామంలో డప్పు ద్వారా చాటింపు చేయించి గ్రామస్తులకు సమాచారం ఇస్తారని అలాంటి సమాచారం లేకపోవడం గ్రామసభ నిర్వహణ చేయడం గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులైన గ్రామస్తులకు సమాచారం ఇవ్వక పోవడం కొంతమందికే సమాచారం ఇచ్చి గ్రామసభను నిర్వహించడం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ఇలాంటి సంఘటనలు గ్రామంలో మళ్లీ పునరావృతం కాకుండా గ్రామపంచాయతీ పాలకవర్గం చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇట్టి విషయాన్ని గ్రామ కార్యదర్శి గీతాను విజయ క్రాంతి వివరణ కోరగా గ్రామంలో డప్పు ద్వారా చాటింపు చేయలేదని ఒకరోజు ముందుగా సాయంత్రం సమాచారం వచ్చింది. చాటింపు చేయించేందుకు వ్యక్తులు లేక చేయించలేదని ఆమె తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని ఆమె పేర్కొన్నారు.