13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

బ్లడ్ క్యాన్సర్‌కు యశోదలో అత్యాధునిక వైద్యం

27-03-2026 01:23 AM

మిర్యాలగూడ, మార్చి 26 : బ్లడ్ క్యాన్సర్ కి యశోద ఆసుపత్రిలో ఆధునిక వైద్యం అందిస్తున్నట్లు కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, హీమాటో ఆంకాలజిస్ట్ డాక్టర్ జి.వంశీకృష్ణ రెడ్డి తెలిపారు. గురువారం మిర్యాలగూడ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల నల్గొండ జిల్లాకు చెందిన ఓ 20 ఏళ్ల యువకుడు జ్వరం, పళ్ళ దంతాల నుంచి రక్తస్రావం, తలనిర్బంధం శరీరంపై రక్తస్రావ మచ్చలతో మలక్ పేట యశోద ఆసుపత్రి లో చేరినట్లు పేర్కొన్నారు.

వైద్య పరీక్షల్లో అతడికి అక్యూట్ ప్రోమైలోసిటిక్ లుకేమియా (ఏపీఎంల్ ) అనే ప్రాణంతక రక్త క్యాన్సర్ గా నిర్ధారణ అయ్యిందన్నారు. వివిధ శాఖల వైద్య బృందం పర్యవేక్షణలో రోగికి ఏ టీ ఆర్ ఏ, ఆర్సెనిక్ ఆధారిత ఇండక్షన్ కెమోథెరపీ అందించడంతో పాటు, పీఆర్బీసీ, ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్లు, క్రయోప్రెసిపిటేట్, యాంటీబయోటిక్స్, యాంటీఫంగల్స్ చికిత్స అందించడం ద్వారా క్యాన్సర్ ని జయించినట్లు పేర్కొన్నారు. అత్యాధునిక కేన్సర్ చికిత్స సదుపాయాలు, నిపుణులైన వైద్య బృందాలు అందుబాటులో ఉండి, అత్యవసర రక్త క్యాన్సర్ కేసులకు అత్యంత సమర్ధవంతమైన చికిత్సను అందించగలమని యశోదా ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ఈ సమావేశంలో మలక్ పేట యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ గోరుకంటి పవన్, యూనిట్ హెడ్ కే శ్రీనివాస్ రెడ్డి, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిదుర,  పిఆర్‌ఓ ఏ. వాసుకిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.