19 April, 2026 | 5:14 AM

విద్యాసంస్థలలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

03-06-2025 01:10 AM

కరీంనగర్ క్రైం, జూన్ 2 (విజయక్రాంతి): హనుమాన్ నగర్ లోని బ్లూ బెల్స్ హై స్కూల్ ప్రాంగణంలో తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా, జాతీయతా గర్వంతో జరిపారు. రాష్ట్ర అవతరణకు సంబంధించిన చరిత్రను గుర్తు చేస్తూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను స్మరించుకునేలా ఈ వేడుకలు నిర్వహించబడ్డాయి.

కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి జంగ సునిత మనోహర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై, నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఆర్విన్ -భగవతి పాఠశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాలల చైర్మెన్ బి. రమణరావు మరియు డైరెక్టర్ బి. విజయలక్ష్మిగారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంబించారు.

ఉపాధ్యాయులు గ్రూపులుగా ఏర్పడి తెలంగాణకు సంబందించిన చరిత్ర, అమలవుతున్న పథకాలు, తెలంగాణ దేవాలయాలు, సంస్కృతి సంప్రదాయాలు మొదలగు విషయాలపై చక్కని వివరణలతో కార్యక్రమం ఆధ్యంతం ఎన్నో విషయాలతో కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ లోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో జాతీయ జెండా ఎగరవేసి అనంతరం ప్యారడైజ్ మరియు విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ పి.ఫాతిమా రెడ్డి మాట్లాడుతూ.

ఎంతో మంది ప్రాణత్యాగం చేయడం జరిగిందని అమరవీరులకు ఈరోజు నివాళులు అర్పించడం ఎంతో అవసరమని, మనం ఈ అభివృద్ధి చెందుతున్న తెలంగాణను అభివృద్ధి చెందిన తెలంగాణ మార్చే దశలో ఎంతో కీలకమైన పాత్ర వహించాలని అన్నారు.