28-10-2025 12:57:51 AM
రాజాపూర్ అక్టోబర్ 27: సమాజాన్ని పట్టిపీడిస్తున్న మత్తు పదార్థాలకు ప్రజల దూరంగా ఉండాలని ఎస్త్స్ర శివానంద గౌడ్ తెలిపారు.పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా సోమవారం పో లీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ డ్ర గ్స్ నిర్వహణ నివారణలో పోలీసుల పా త్ర,విద్యార్థులు డ్రగ్స్ నుండి ఎలా దూరంగా ఉండాలనే అనే అంశంపై రాజాపూర్ పోలీ సు శాఖ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరము, 10వ తరగ తి చదువుతున్న విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రధానం చేసిన ట్లు ఎస్త్స్ర తెలిపారు.ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.