28-10-2025 12:56:25 AM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ టౌన్, అక్టోబర్ 27: నగరంలోని ప్రతి కాలనీలో అభివృద్ధి పను లు శరవేగంగా జరుగుతున్నాయని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మహబూబ్ నగర్ ఎంపి డీకే అరుణ తో కలిసి రూ 38 లక్షలతో జనరల్ ఫండ్ తో సిసి రోడ్, అండ ర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణపు పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మహబూబ్ నగర్ ను అద్బుతంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ నాయకులు తిరుమల వెంకటేష్, ఖాజా పాషా , ఉమర్, రఘురామిరెడ్డి, లీడర్ రఘు, కా లనీ అధ్యక్షులు, రామేశ్వర్ రెడ్డి కార్యదర్శి ఆంజనేయు లు గౌడ్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.