calender_icon.png 18 May, 2025 | 7:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నడుస్తున్న కారు స్టీరింగ్ లాక్..

17-05-2025 12:29:22 AM

- అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా 

 కార్వాన్, మే 16: రోడ్డుపై నడుస్తున్న ఓ కారు స్టీరింగ్ ప్రమాదవశాత్తు లాక్ అయింది. దీంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొని బోల్తా పడిన సంఘటన లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. ఇన్స్పెక్టర్ వెంకట్ రాములు తెలిపిన వివరాల ప్రకారం.

బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని సన్ సిటీ ప్రాంతానికి చెందిన అద్నాన్ అహ్మద్ శుక్రవారం నానల్ నగర్ సమీపంలోని ఫ్లోర్ మిల్ నుంచి తన హోండా సిఆర్వి కారులో ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యంలో లంగర్ హౌస్ లోని ఇంద్రారెడ్డి ఫ్లైఓవర్ పై కారు స్టీరింగ్ ప్రమాదవశాత్తు లాక్ అయింది.

దీంతో అదుపుతప్పి ఫ్లైఓవర్ పై ఉన్న డివైడర్ బీమ్సును ఢీకొని బోల్తా పడింది. అదృష్టవశాత్తు కారు ఎయిర్ బెలూన్సు ఓపెన్ కావడంతో అద్నాన్ అహ్మద్ కు ఎలాంటి గాయాలు కాలేదు. వాహనాలు స్తంభించడంతో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజయ్య సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని వాహనాలను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ వెంకట్ రాములు తెలిపారు.