17-05-2025 12:29:35 AM
కరీంనగర్, మే 16 (విజయ క్రాంతి): జగిత్యాల జైత్రయాత్ర యాత్ర నిర్మాతల్లో ఒకరైన నారాయణ మరణించారు. నారాయణ సార్‌గా పిలవబడే ఆయన ప్రజల మనిషి. కరీంనగర్ జిల్లాలో ఎదిగి వచ్చిన తొలి తరం నక్సలైట్ నాయకులలో ఆయన ఒకరు. మూడు నెలలుగా లివర్ అన్న వాహి క వద్ద ఏర్పడిన కాంతితో జీర్ణవ్యవస్థ వ్యవస్థకు అడ్డు పడి ఆపరేషన్ అయ్యి కోలుకు న్నారు.
తిరిగి లీక్ కావడం తో గురువారం అర్ధరాత్రి తరువాత తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఆయన మృతికి పలువురు తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆయన మృతి పట్ల పలు సాహితీ, సాంస్కృతిక సంస్థలు, అభ్యుదయ వాదులు,పౌరహక్కుల సంఘా లు, ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశాయి.