30 August, 2026 | 12:53 AM

విద్యార్థులంతా ఒకేస్థాయిలో చదివేలా చూడాలి

30-08-2026 12:00 AM

అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి గ్రామంలో అభివృద్ధి, పారిశుద్ధ్య పనుల పరిశిలన

షాద్‌నగర్, ఆగస్టు 29 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి సందర్శించారు. పాఠశాలను సందర్శించిన ఆమె విద్యార్థులతో ముచ్చటించారు. తరగతి గదులను పరిశీలించారు.

ఈ సందర్భంగా రెండు, మూడు తరగతి విద్యార్థుల్లో కొందరు చదువులో చాలా వెనుకబడి ఉన్నారని ఆమె గుర్తించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి విద్యార్థులందరూ ఒకే విధంగా చదివేల చర్యలు చేపట్టాలని అధ్యాపకులకు ఆమె సూచించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ....

పెంజర్ల గ్రామపంచాయతీ ఆవరణలోని క్రీడా ప్రాంగణం, పల్లె ప్రగతివనం, ప్లాంటేషన్ యాక్టివిటీస్, నర్సరీ, అంగన్వాడీ సెంటర్, స్కూల్ ను సందర్శించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం తరఫున విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా చూస్తున్నామని పుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం అందరికీ అందేలా చూస్తున్నామని ఆమె అన్నారు. 

అనంతరం గ్రామ పంచాయతీ పరిధిలోని పారిశుద్ధ్య నిర్వహణ, పల్లె ప్రకృతి వనం (PPV), నర్సరీలను పరిశీలించి వాటి నిర్వహణపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పల్లె ప్రకృతి వనం, నర్సరీల్లో మొక్కల సంరక్షణ, వాటి పెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.   

విద్యార్థులకు నాణ్యమైన విద్య, పిల్లలకు పౌష్టికాహారం, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ నిరంతరం కొనసాగించాలని,

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రలో జగన్   పాల్గొన్నారు