calender_icon.png 20 May, 2025 | 10:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

20-05-2025 12:45:42 AM

జిల్లా కలెక్టర్ జితేష్ వీ పాటిల్   

భద్రాద్రి కొత్తగూడెం మే 19 (విజయక్రాంతి)ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తు లు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు.సోమవారం ఐ డిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుం డి వచ్చిన దరఖాస్తులను స్వీకరించి, పరిశీలించిన అనంతరం సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా దరఖాస్తు చేసిన అభ్యర్థుల ను వివరాలను అడిగి తెలుసుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని శాఖ ల వారీగా అధికారులను ఆదేశించారు.