20-05-2025 12:41:10 AM
భద్రాద్రి కొత్తగూడెం, మే 19, (విజయక్రాంతి) జిల్లాలో ఉన్న వాహనాలన్నిటికీ ప న్నులు విధిగా చెల్లించాలని వరంగల్ డిప్యూ టీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పురుషోత్తం అన్నా రు. సోమవారం కొత్తగూడెం రవాణా శాఖ కార్యాలయ పరిశీలనకు విచ్చేసిన వరంగల్ డిప్యూటీ రవాణా శాఖ కమిషనర్ పురుషో త్తం మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు నిర్ణీత సమయంలో వి ధిగా పన్నులు చెల్లించాలని, లేనియెడల అపరాధ రుసుము విధిస్తామని హెచ్చరించారు.
ప్రైవేటు విద్యాసంస్థలు విద్యా సంవత్సరం ఆరంభం నాటికి బస్సుల ఫిట్నెస్, పన్నుల చె ల్లింపులు పూర్తి చేయాలని తెలిపారు. మున్సిపల్ వాహనాలు విధిగా రోడ్డు పన్ను చెల్లిం చాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వ వాహనాలన్నింటికీ నిర్ణీత సమయంలో పన్నులు చెల్లించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి వెంకటరమణ, కొత్తగూడెం ఎం వి ఐ మనోహర్, ఎంవిఐ నిర్మలారెడ్డి, భద్రాచలం ఎం వి ఐ వెంకట పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.