01-07-2025 12:57:25 AM
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ, జూన్ 30 (విజయ క్రాంతి): ప్రజావాణిలో వచ్చిన వినతులను పరిష్కరించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతులను జిల్లా కలెక్టర్ కు అందజేశారు.
ప్రజలు అందించిన వినతులను వెంటనే సంబంధిత శాఖల అధికారులకు పరిష్కారానికి చర్యలు చేపట్టడంపై కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు 176 వినతులను అందజేశారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన వినతులను త్వరగా పరిష్కరించాలన్నారు.
వచ్చిన పలు వినతులపై తక్షణమే చర్యలు చేపట్టాలని జిల్లాలోని పలువురు తహసిల్దార్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వై.వి.గణేష్, ఆర్డీవోలు, వివిధ శాఖల జిల్లా అధికారులు, అధికారులు పాల్గొన్నారు.