calender_icon.png 1 July, 2025 | 4:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రాభివృద్ధికి సహకరించని కేంద్ర మంత్రులు

01-07-2025 12:55:32 AM

ఖర్గే సభ విజయవంతం తో కాంగ్రెస్ సత్తా చాటుతాం 

వరంగల్ (మహబూబాబాద్), జూన్ 30 (విజయ క్రాంతి): రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రులు సహకరించకుండా, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై అక్కసు వెళ్ళగక్కుతున్నారని, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వద్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు, పల్లె శ్రీనివాస్ గౌడ్, మోత్కూరి ధర్మారావు అన్నారు.

హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ఏమాత్రం సహకరించకుండా, రాష్ట్రం నుంచి కేంద్రానికి చెల్లిస్తున్న నిధులలో రాష్ట్ర వాటా కోసం కృషి చేయకుండా, బిజెపి పాలిత రాష్ట్రాలకు పెద్దపీట వేస్తున్నప్పటికీ మిన్నకుండి పోతున్నారని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపులో మొండి చేయి చూపుతున్నప్పటికీ, రెండో దశ మెట్రో, త్రిబుల్ ఆర్, ముసి నది ప్రక్షాళన కోసం నిధుల కేటాయింపు కోసం కృషి చేయడం లేదని విమర్శించారు. జూలై 4న హైదరాబాదులో నిర్వహించే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత కోసం కృషి జరుగుతుందని తెలిపారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి హైదరాబాదు సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రణాళిక బద్ధంగా జిల్లా నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలను తరలిస్తామని పేర్కొన్నారు. వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జిగా నియమితులైన దుద్దిల్ల శీను బాబు ను ఘనంగా సత్కరించారు.