calender_icon.png 1 July, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పథకాలు పక్కాగా అమలు చేయాలి

01-07-2025 12:57:50 AM

ప్రజావాణికి 97 దరఖాస్తులు,  మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, జూన్ 30(విజయక్రాంతి): ప్రజా సమస్యలు తప్పనిసరిగా పరిష్కరించాలని, ప్రభుత్వ పథకాలు పక్కాగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీవో పిడి శ్రీనివాసరావులతో కలిసి కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా ప్రజల నుండి కలెక్టర్ వినతులను స్వీకరించారు.

కాగా ప్రజావాణికి 97 దరఖాస్తు లు రాగా భూ సమస్యలు 33, ఇందిరమ్మ ఇండ్ల కొరకు 20, పింఛన్ కొరకు 5, ఇతర సమస్యలు 39 ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కృషి చేయాలన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించే విధంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.