15-07-2025 12:52:28 AM
అర్హులందరికీ తప్పనిసరిగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు-మంత్రి పొంగులేటి
ఖమ్మం, జూలై 14( విజయ క్రాంతి):పేదలకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వం పాలన సాగిస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, స మాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తిరుమలాయపా లెం మండలంలో సోమవారం పర్యటించి ప లు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
అజ్మీర తండా గ్రామంలో 2 కోట్ల 50 లక్షల తో అజ్మీర తండా నుండి రాకాసి తండా రో డ్డు హై లెవెల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు మరమ్మ త్తు పనులకు, హైదర్ సాయి పేట గ్రా మంలో హైదర్ సాయి పేట నుండి సీరోలు (ఆకేరు) వరకు ఒక కోటి 65 లక్షలతో, హై దర్ సాయి పేట నుండి చిలక్కోయలపాడు వరకు 90 లక్షలతో నిర్మించనున్న బీటీ రో డ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జల్లేపల్లి గ్రామంలో జల్లేపల్లి నుండి దేవుని గుట్ట వరకు 4 కోట్ల 18 లక్షలతో నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు. ఈ గ్రామంలో 83 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు వే సుకున్నామని, 6 లక్షల రూపాయలతో త్రా గు నీటి ఏర్పాట్లు చేశామని అన్నారు.గత ఏ డాది వరదల కారణంగా కొట్టుకొని పోయిన గోపాలపురం జల్లెపల్లి రోడ్డు బ్రిడ్జిను 33 కో ట్ల రూపాయలతో, పాతర్లపాడు క్రాస్ రోడ్డు నుంచి రావి చెట్టు తండా రోడ్డు 20 కోట్లతో, పాతర్లపాడు క్రాస్ రోడ్డు నుంచి జల్లెడుపల్లి రోడ్డు 27కోట్లతో చేసుకుంటున్నామని అ న్నారు.
పేద ప్రజల పిల్లలు చదువుకునేందు కు మంచి వసతులు కల్పించాలని సుబ్లైడ్ గ్రామంలో 2 కోట్ల 70 లక్షలతో నిర్మించనున్న ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ నిర్మాణ పనుల కు, సుబ్లైడ్ గ్రామంలో ఒక కోటి 30 ల క్షలతో నిర్మించనున్న పాలేరు-మరిపెడ రోడ్డు లోనీ సైడ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చే శామని అన్నారు. సుబ్లేడ్ గ్రామంలో కోటి రూపాయలతో సిమెంట్ రోడ్లు వేసుకున్నామని అన్నారు.
పాలేరు మరిపెడ రోడ్డు 16 కోట్లతో మంజూరు చేశామని, త్వరలో వీటి పనులు ప్రారంభం అవుతాయని అన్నారు. సుబ్లెడ్ గ్రామంలో దాదాపు 35 కోట్ల రూపాయలతో గ్రామ అభివృద్దికి చర్యలు చేపట్టా మని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చి న హామీల మేరకు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. పేద ప్రజలకు 200 యూనిట్లు ఉచిత వి ద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఉగాది నుండి రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా, ఆరోగ్య శ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు, నేటి నుంచి 3 లక్షల 55 వేల నూతన రేషన్ కార్డులను జారీ చేస్తున్నామని అన్నా రు.
22 వేల 500 కోట్లతో ప్రభుత్వం పేద ప్ర జల సొంతింటి కల కోసం 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల మొదటీ విడతలో మంజూరు చేసిందని అన్నారు. ప్రతి సంవత్సరం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ఉంటుందని, అర్హులై న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఇందిరమ్మ ఇండ్లు అందుతుందని అన్నారు.
ఈ కార్యక్రమాల్లో ఇర్రిగేషన్ ఎస్‌ఇ ఎం. వెంకటేశ్వర్లు, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, పాలేరు ని యోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎన్. విజయలక్ష్మి, ఆర్ అండ్ బి ఇఇ పవార్, గిరిజన సంక్షేమ శాఖ ఇఇ హరీష్ కుమార్, విద్యా శాఖ ఇ ఇ విన్సెన్ట్, తిరుమలాయపాలెం మం డల తహసీల్దార్ విల్సన్, ఎంపిడివో సిలార్ సాహెబ్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.