calender_icon.png 15 July, 2025 | 6:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం

15-07-2025 12:50:54 AM

- గత పది సంవత్సరలలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదు

- రాష్ట్ర ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల: జులై 14 వేములవాడ పేద ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతను ఇస్తుందని రాష్ట్ర ప్ర భుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.సోమవారం వేములవాడ పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వేములవాడ రూరల్ మండలం పరిధిలోని 9 కల్యాణ ల క్ష్మి షాదీ ముబారక్,అర్హులైన 44 మందికి 14 లక్షల 20 వేల విలువ గల, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్బన్, పట్టణ పరిధిలోని 10 లక్షల 72 వేల విలువ గల 32 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను రాష్ట్ర ప్రభుత్వ విప్ లబ్ధిదారులకు పంపిణీ చేశా రు.

వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని గత ప్రభు త్వం అప్పుల కుప్పగా మార్చిన కానీ ఇందిరమ్మ రాజ్యంలో గత ప్రభుత్వం అమలు చే స్తున్న ఒక్క పథకాన్ని కూడ రద్దు చేయకుండా నూతన పథకాలను అమలు చేస్తున్న ట్లు తెలిపారు.గత పది సంవత్సరాల్లో పది రే షన్ కార్డులు కూడ ఇవ్వలేదన్నారు.. తెలంగాణా వ్యాప్తంగా రేషన్ కార్డులు లేని వారికి కార్డులు ఇస్తూ వెంటనే 6 కిలోలో సన్నం బి య్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 61 వేల నూతన రేషన్ కార్డులు మంజూరు,27 లక్షల 83 వేల అదునపు ఇంటి సభ్యులను రేషన్ కార్డుల్లో నమో దు చేసినట్లు తెలిపారు.నిరుపేదలకు పక్క ఇంటి నిర్మాణం కోసం.స్వంత ఇంటి కలను సాకారం చేస్తూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చే పట్టడం జరుగుతుందన్నారు..పేద ప్రజలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేయడం జరుగుతుందన్నారు.తెలంగాణ రా ష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ సమావేశంలో చారిత్రాత్మక నిర్ణ యం తీసుకొని అమలు చేసేందుకు పంచాయతీ రాజ్ చట్టం-2018కి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.