13-09-2025 02:23:51 PM
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ కు వినతి పత్రం అందజేత..
మహబూబాబాద్ (విజయక్రాంతి): మెనూ ప్రకారం భోజనం పెట్టని ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని, మహబూబాబాద్ జిల్లాలోని గురుకులాల పట్ల సంబంధిత శాఖల అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎస్.ఎఫ్.ఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు గంధసిరి జ్యోతి బసు ఆరోపించారు. మహబూబాబాద్ పట్టణంలోని ఎస్సీ బాలికల సాంఘిక సంక్షేమ గురుకులంలో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ అనిల్ కుమార్(District Additional Collector Anil Kumar)కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గురుకులంలో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండడం వల్ల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని వాపోయారు. కొత్త మోను వచ్చినా, సక్రమంగా అమలు చేయడం లేదని, విద్యార్థులకు గురుకులంలో భోజనం, టిఫిన్లు అందడం లేదని ఫిర్యాదు చేశారు.