13-09-2025 02:28:48 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) నెల్లికుదురు మండల కేంద్రంలో ఇరాగాని రాధమ్మ(75) అనుమానస్పద స్థితిలో ఇంటి ముందు ఉన్న బావిలో పడి మరణించింది. మృతురాలు ఒంటరిగా ఇంట్లో ఉంటుండగా ఆమెను నగల కోసం దొంగలు హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. అయితే బావిలో నుంచి వృద్ధురాలు మృతదేహాన్ని బయటికి తీయగా ఆమె చేతిలోనే బంగారు పుస్తెలతాడు ఉండడం ఈ సంఘటనకు బలం చేకూరుస్తోంది. సంఘటన స్థలాన్ని ఎస్ఐ రమేష్ బాబు సందర్శించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.