calender_icon.png 14 September, 2025 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మణిపుర్.. దేశానికి ప్రకృతిచ్చిన బహుమతి

13-09-2025 02:32:39 PM

మణిపుర్ పేరులోనే మణి ఉంది.. అది దేశానికే మణి

న్యూఢిల్లీ: మణిపూర్ లో ప్రధాని మోదీ(PM Narendra Modi) పర్యటిస్తున్నారు. మణిపుర్ అల్లర్ల(Manipur riots) బాధితు కుటుంబాలను మోదీ పరామర్శించారు. బాధిత కుటుంబాల చిన్నారులతో ఆయన ముచ్చటించారు. అల్లర్ల తర్వాత తొలిసారి మోదీ మణిపూర్ లో పర్యటిస్తున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ... భారీ వర్షాల వల్ల హెలికాప్టర్ లో రావడం సాధ్యపడకపోవడంతో రోడ్డుమార్గంలో మణిపూర్ కు వచ్చా అన్నారు. రోడ్డు మార్గంలో వచ్చేటప్పుడు నాకు మీరు పలికిన స్వాగతం మర్చిపోలేనని చెప్పారు. మువ్వన్నెల జెండాలు చేతబట్టి నాకు ఘనంగా స్వాగతం పలికారని తెలిపారు. మణిపుర్ పేరులోనే మణి ఉంది.. అది దేశానికే మణి వంటిదన్నావారు. మణిపుర్.. దేశానికి ప్రకృతి ఇచ్చిన బహుమతి అన్నారు. మణిపుర్ ను వేగంగా ప్రగతి పథంలో పయనింపజేస్తామని హామీ ఇచ్చారు. మణిపుర్ కోసం రూ. 7 వేల కోట్ల ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నామని తెలిపారు.

మణిపుర్ ను దేశంలో అనుసంధానం చేసే ప్రాజెక్టులు చేపడుతున్నామని వెల్లడించారు. రైలు, రోడ్డు మార్గాల కోసం మణిపుర్ కు నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. రూ. 8 వేల కోట్లతో జాతీయ రహదారుల పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. మణిపుర్ లో రైల్ కనెక్టివిటీ భారీగా పెంచుతున్నామని తెలిపారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని పేర్కొన్నారు. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతోందన్నారు. ప్రస్తుతం మణిపుర్ లో చేపడుతున్న ప్రాజెక్టులతో మౌలిక సదుపాయాలు, వైద్యసేవలు మెరుగుతాయని సూచించారు. ఈశాన్య రాష్ట్రాల్లో దశాబ్దాలుగా అనేక వివాదాలు, ఉద్యమాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి నెలకుంటోందని చెప్పారు. శాంతి స్థాపన ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. శాంతిస్థాపన ద్వారా మీ భావితరాల భవిష్యత్ బావుంటుందని వివరించారు. మణిపుర్ ప్రజల వెంట భారత ప్రభుత్వం ఉందన్నారు. మణిపుర్ లో 7 వేల కోత్త ఇళ్లు నిర్మిస్తున్నామని ప్రధాని వెల్లడించారు. మీ సమస్యలన్నీ పరిష్కరించే పని కొనసాగుతుందని ప్రధాని పేర్కొన్నారు.