calender_icon.png 17 July, 2025 | 1:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ భారతి చట్టం నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారానికి చర్యలు

16-07-2025 12:00:00 AM

చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ లోకేష్ కుమార్

ములుగు, జూలై15(విజయక్రాంతి): భూ భారతి చట్టం నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చీఫ్ కమీషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ లోకేష్ కుమార్ తెలిపారు.మంగళవారం సిసిఏల్‌ఏ లోకేష్ కుమార్ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై అదనపు కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ సిహెచ్.మహేందర్ జి నుంచి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చీఫ్ కమీషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో భూ సమస్యల పరిష్కారానికి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి భూ భారతి చట్టం నిబంధనల ప్రకారం వేగంగా పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.

ఫైల్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్ పద్ధతి లో ప్రొసీజర్ ప్రకారం మాత్రమే నిర్వహించాలని,త్వరలో దరఖాస్తు పెండింగ్ ఎక్కడ ఉన్నది చెక్ చేసుకునే అవకాశం ప్రజలకు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. హైకోర్టు నుంచి వచ్చే తీర్పు మేరకు సాధా బైనామా దరఖాస్తులు పరిష్కారం చేయాల్సి ఉంటుందని, ప్రస్తుతం వాటిని మినహాయించి మిగిలిన దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత కల్పించాలని అన్నారు.