calender_icon.png 16 July, 2025 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సౌకర్యం కోసం వస్తే అసౌకర్యం!

16-07-2025 12:00:00 AM

విజయ క్రాంతి, మహబూబాబాద్ :మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు, బ్యాటరీ వీల్ చైర్స్, వివిధ రకాల పరికరాలను ప్రభుత్వం ద్వారా సమకూర్చడానికి గతంలో దరఖాస్తులు స్వీకరించారు. మంగళవారం దరఖాస్తుదారుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హాజరుకావాలని దివ్యాంగులకు సూచించారు.

సుమారు వెయ్యి మంది కి పైగా దివ్యాంగులు జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్ కు తరలివచ్చారు. అయితే కలెక్టర్ కార్యాలయ కాంప్లెక్స్ లో దివ్యాంగుల సంక్షేమ కార్యాలయానికి వెళ్లడానికి అవసరమైన సౌకర్యం కల్పించకపోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. నడవలేని స్థితిలో ఉన్న చాలామంది దివ్యాంగులకు కనీసం వీల్ చైర్ ఏర్పాటు చేయకపోవడంతో బంధువులు, కుటుంబ సభ్యులు అష్ట కష్టాలు పడి వారి ని మోసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని దివ్యాంగుల సంఘం ప్రతినిధి దేవులపల్లి సునీల్ ఆవేదన వ్యక్తం చేశారు.

దివ్యాంగులకు సౌకర్యాలు పొందడానికి వస్తే, కార్యాలయంలోకి వెళ్లడానికి కనీస సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి కలెక్టర్ కార్యాలయం కాంప్లెక్స్ లో దివ్యాంగులకు వివిధ శాఖల అధికారుల వద్దకు వెళ్లే విధంగా సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు.