19 August, 2026 | 2:46 AM

కౌలాస్ కోట అభివృద్ధికి అడుగులు

19-08-2026 12:48 AM

కౌలాస్ కోటకు ప్రత్యేక గుర్తింపు 

రాష్ట్రంలో 11 కోటల అభివృద్ధికి ప్రభుత్వం చూపు 

కౌలాస్ కోట అభివృద్ధితో జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధికి మరో ముందడుగు 

కామారెడ్డి, ఆగస్టు 18 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన కౌలాస్ కోట అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 11 కోటలను అభివృద్ధి చేసేందుకు చొరవ చూపుతుంది. ఎంతో చరిత్ర కలిగిన కామారెడ్డి జిల్లాలోని కౌలస్ కోట ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. 

కౌలాస్కోటకు 1000 సంవత్సరాల చరిత్ర..

 కౌలాస్ సంస్థానం పరిపాలనలో కౌలాస్ కోట ఎంతో ప్రసిద్ధి చెందింది. కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులు ఉన్న కౌలాస్ సంస్థానం మూడు భాషలకు ప్రసిద్ధి చెందింది. మూడు రాష్ట్రాల కలయికతో ఉండడంతో ఇక్కడి ప్రాంత ప్రజలు మూడు భాషలను మాట్లాడతారు. కౌలాస్ రాజులు మూడు ప్రాంతాల ప్రజల మనోభావాలు తెలిసిన వ్యక్తులు కావడంతో కౌలాస్ కోటకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వేల సంవత్సరాలు క్రితం నిర్మించిన ఈ కోట లో అప్పట్లో నిర్మించిన కట్టడాలు నేటికీ కొన్ని చెక్కుచెదరకుండా ఉన్నాయి.

మరికొన్ని శిథిలావస్థలోకి చేరాయి. కౌలాస్ సంస్థానంలో రాజులు పరిపాలన కొనసాగింది. నేడు రాజుల పరిపాలన లేక కనుమరుగయ్యారు. ప్రస్తుతం కోట మాత్రం శిథిలావస్థలో ఉన్న అప్పటి కళాకారులు, రాజులు నిర్మించిన కోట నైపుణ్యత నేటికీ కౌలాస్ కోటలో ఉట్టిపడుతుంది. కామారెడ్డి జిల్లాలోని కౌలాస్ కోటకు ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో 11 కోటలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుము బిగించింది. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో కోటలను సందర్శించి ఆధుని కరణ చేపట్టేందుకు ప్రభుత్వం నడుం బిగించింది.

ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో కోటల అభివృద్ధి

కౌలాస్ కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకు కావలసిన ఏర్పాట్లకు అడుగుపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలోని 11 కోటలను అభివృద్ధి చేసేందుకు ఖరార్ చేసింది.

పర్యాటక కేంద్రంగా మారనున్న కౌలాస్ కోట

రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 11 కోటల అభివృద్ధికి నడుం బిగించింది. ప్రభుత్వ, ప్రవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచాలని భావిస్తుంది. దీంతో కామారెడ్డి జిల్లాలోని కౌలాస్ కోట అభివృద్ధికి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ప్రభుత్వ ప్రవేట్ భాగస్వామ్యంతో పరాటకర రంగంగా కౌలస్ కోటను తీర్చిదిద్దన్నారు.

స్థానికులకు ఉపాధి

 కామారెడ్డి జిల్లా కౌలాస్ కోట అభివృద్ధి చెందితే స్థానికులకు ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. అంతేకాకుండా వ్యాపార అభివృద్ధి కేంద్రంగా మారనుంది. కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉండడంతో మూడు రాష్ట్రాల ప్రజలకు పర్యాటక కేంద్రంగా కౌలాస్ కోట నిలువనుంది..

స్థానికుల హర్షం

కామారెడ్డి జిల్లాలో కౌలాస్ కోటను అభివృద్ధి చేసి పర్యాట కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుండడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పురావస్తు శాఖ వారిని తీసుకువచ్చి కౌలాస్కోట అభివృద్ధి చెందితే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందడమే కాకుండా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో కోటలాభివృద్ధికి ప్రభుత్వం నడుంబిగించింది. 11 కోటలు అభివృద్ధి చేయనున్నట్లు పర్యాటక రంగ అభివృద్ధి దిశగా అడుగులు వేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ నిర్ణయం హర్షనీయం 

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని కౌలాస్ కోట అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయడం హర్షించ దగ్గ విషయమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు విజయక్రాంతి ప్రతినిధితో తెలిపారు. కౌలాస్కోట అభివృద్ధి చెందితే కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. మూడు ప్రాంతాల ప్రజలకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వం కౌలాస్ కోట అభివృద్ధికి ముందుకు రావడం హర్షించ తగిన విషయం.