calender_icon.png 2 June, 2025 | 12:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుళ్లిన వ్యర్థాలతో దుర్గంధం

08-05-2025 12:00:00 AM

బూర్గంపాడు,మే7(విజయక్రాంతి): బూర్గంపాడు మండలం సారపాక పంచాయతీ పరి ధిలోని శ్రీరాంపురం ఎస్టీ కాలనీకి వెళ్లే దారిలో కుళ్లిన వ్యర్థాలతో దుర్గంధం వ్యాపిస్తోంది.సారపాక పరిసర ప్రాంతాల్లోని చికెన్ వ్యర్థాలతో పాటు తాగేసిన కొబ్బరి బోండాలు,ఇతర చెత్తను ఇక్కడే పడేస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అధికారులు స్పందించి వ్యర్థాలు వేయకుండా చూడాలని కోరుతున్నారు.