మానవ అక్రమ రవాణాను అరికట్టాలె
శుక్రవారం హెచ్‌ఐసీసీ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై జరిగిన సెమినార్‌లో పాల్గొన్న డీజీ శిఖా గోయల్ తదితరులు
డీజీ శిఖా గోయల్
హైదరాబాద్, ఆగస్టు 30(విజయక్రాంతి): మానవ అక్రమ రవాణాను వ్యూహాత్మంగా అరికట్టాల్సిన ఆవశ్యకత ఉందని డీజీ శిఖా గోయల్ పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణాపై తెలంగాణ మహిళా భద్రతా పోలీసు విభాగం ఆధ్వర్యంలో హెచ్‌ఐసీసీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన సెమినార్ శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు వక్తలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా హ్యూమన్ ట్రాఫికింగ్‌ను నియంత్రించడంలో తెలంగాణ మహిళా భద్రతా పోలీసు విభాగం చేసిన చర్యలను శిఖా గోయెల్ కొనియాడారు.
అలాగే, బాధితుల కేంద్రీకృత విధానం, సురక్షితమైన వలస విధానాలు, చట్టపరంగా బలమైన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడం ద్వారా హ్యూమన్ ట్రాఫికింగ్‌ను నియంత్రించొచ్చని వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి ప్రాణాలతో బయటపడిన వారిని సన్మానించారు. సెమినార్‌లో దాదాపు 225మందికి పైగా ఐఏఎస్‌లు, పోలీస్ సిబ్బంది, రిటైర్డ్ న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు, మీడియా ప్రతినిధులు పాల్గొని తమ సూచనలు చేశారు. కార్యక్రమంలో కురళముతన్, ప్రియాంక గ్రేవాల్, దీరేంద్రనాథ్, డాక్టర్ టీనా కురయకోస్ వంటి వక్తలు పాల్గొన్నారు.






