9 April, 2026 | 8:46 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

ఇతర మండలాలకు ఇసుక రవాణా ఆపండి

12-02-2026 12:20 AM

వెల్దుర్తి, ఫిబ్రవరి 11 : వెల్దుర్తి మండలం మెల్లూరు గ్రామంలోని హ ల్దీ వాగు నుండి ఇతర మండలాలకు ఇసుక రవాణాను ఆపాలని మెల్లూరు సర్పంచ్ రంగారెడ్డి అధికారులకు విజ్ఞ ప్తి చేశారు. బుధవారం గ్రామ సమీపంలోని హల్ది వాగులో విచ్చలవిడిగా ఇత ర మండలాల నుండి ఇసుక నింపేందుకు ట్రాక్టర్లు వాగులోకి రాగా వాటిని అడ్డుకొని మెల్లూరు గ్రామస్తులతో కలిసి వెనక్కు పంపారు.

వెల్దుర్తి మండలంలోని చుట్టుపక్కల గ్రామాలకు ప్రభుత్వ గృహ నిర్మాణ లకు ఇసుక తరలిస్తే సరేనని అలాకాకుండా ఇతర మండలాలకు తమ గ్రామం నుండి ఇసుకను తరలిస్తే భూగర్భ జలాలు అడగంటి త్రాగు, సాగు, నీటి సమస్య ఏర్పడుతుందని తెలిపారు. అంతేకాకుండా గ్రామ సమీపంలోని హల్ది వాగులో ఇసుక నిలువలు ఎప్పటికీ తక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.