9 April, 2026 | 10:23 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు

12-02-2026 12:19 AM

సిద్దిపేట జిల్లాలో 4 మున్సిపాలిటీలు 

సిద్దిపేట, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మున్సిపల్ ఎన్నికలు బుధవారం ముగిసిపోయాయి. ఓటర్ల పనితనం ముగిసిన, అభ్యర్థుల అదృష్ట ఫలితాలు ముగియలేదు. సిద్దిపేట జిల్లాలో దుబ్బాక, హుస్నాబాద్, గజ్వేల్, చేర్యాల మున్సిపాలిటీలలో ఎన్నికలు జరిగాయి. దుబ్బాక 85.05% పోలింగ్ నమోదయింది. 20 వార్డులుండగ 21341 ఓటర్లకు గాను 1836 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

గజ్వేల్ లో 79.35% పోలింగ్ నమోదవుగా 46740 ఓటర్లకు గాను 37088 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. చేర్యాలలో 83.41% పోలింగ్ నమోదవుగా 1377 మంది ఓటర్లకు గాను 11491 మంది ఓటు వేశారు. హుస్నాబాద్ 84.21% పోలింగ్ నమోదవగా 16192 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హుస్నాబాద్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడక్కడ  సాంకేతిక సమస్యలు తలెత్తిన అధికారులు వెంటనే పరిష్కరించి ఓటర్లకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూంలో పోలింగ్ బ్యాలెట్ లను భారీ బందోబస్తు మధ్య నిలువ చేశారు. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఎప్పటికప్పుడు జిల్లాలోనీ మున్సిపాలిటీలలో పర్యటిస్తూ ఓటర్ నమోదును పరిశీలించారు.