20 July, 2026 | 8:41 PM

ఘనంగా శ్రీజగన్నాథుడి రథయాత్ర

20-07-2026 02:03 AM

కోకాపేట్ నుంచి నార్సింగి హరే కృష్ణ హెరిటేజ్ వద్ద ముగింపు 

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): శ్రీ జగన్నాథుడి రథయాత్ర ఆదివారం ఘనంగా నిర్వహించామని, ఐక్యతను, శాంతి, చైతన్యాన్ని పెంచడం, పవిత్ర అనుభూతిని కలిగించిందని హరేకృష్ణ మూవ్‌మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. కోకాపేట్‌లో నిర్వహించిన శ్రీజగన్నాథుడి యాత్రను ఇస్కాన్ స్థాపనాచార్యులు ప్రభుపాద పేరిట తాడు లాగుడుతో మొదలైంది. దారి పొడవునా వేలాదిమంది భక్తులు యాత్రలో పాల్గొన్నారు. నిర్దేశించిన పలు ప్రాంతాల్లో రథాన్ని నిలిపి పూజలు,

అర్చనలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలను అందజేశారు. చిన్నపిల్లలు రథం ముందు కోలాటాలు, సాంస్కృత్రిక ప్రదర్శనలు నిర్వహించారు. కోకాపేట్, రాజపుష్ప అట్రియా, గోల్డెన్ మైల్, నార్సింగిలోని హరే కృష్ణ హెరిటేజ్ టవర్ వద్ద గౌర చంద్రదాస ప్రభు ప్రవచనంతో శ్రీ జగన్నాథుడి రథయాత్ర కార్యక్రమం ముగిసింది. రథయాత్ర ప్రారంభోత్సవ పూజ, హారతి, చీపురు పట్టే వేడుక కార్యక్రమంలో న్యాయమూర్తి సుద్దాల చలపతి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, ముంగి జైపాల్ రెడ్డిలు విశేష అతిథులుగా హాజరయ్యారు.