నాగోల్‌లో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనుల వేగం పెంచాలి
వర్షాకాలానికి ముందే పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచన
నాగోల్,(విజయక్రాంతి): నాగోల్ డివిజన్ పరిధిలో వెంకటరెడ్డి నగర్ నుంచి వెంకటరమణ కాలనీ వరకు జరుగుతున్న స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనులను మాజీ కార్పొరేటర్ చింతల అరుణా సురేందర్ యాదవ్ జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షిస్తూ, వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కాలనీల్లో తరచూ ఎదురయ్యే నీటి నిల్వ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా ఈ డ్రెయిన్ నిర్మాణం ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు.
పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని సూచించారు. అలాగే పనుల వల్ల స్థానికులకు ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు. స్థానికులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్న ఆమె, అవసరమైన చోట్ల అదనపు సదుపాయాలు కల్పించాలని సూచించారు. నాగోల్ డివిజన్ అభివృద్ధి దిశగా మౌలిక వసతుల పెంపుకు ప్రాధాన్యం ఇస్తున్నామని, ప్రజల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుంటామని అరుణా సురేందర్ యాదవ్ తెలిపారు.






