భారతదేశంలో ముదిరాజ్‌లు
మన కులాలు
ముదిరాజ్‌లు అంటే ‘మొదటి రాజులు’ అని అర్థం. ఇది అతిశయోక్తి కాదు. 2,707 సంవత్సరాల క్రితం మొదటిరాజు అంజన్ మహరాజ్ కోలి ఉత్తరప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్ జిల్లాలో ‘దేవ్‌దా’ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని పాలించేవాడు. ఇతనే 2,707 సంవత్సరాల క్రితం మొదటి క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ముదిరాజ్ కోలి. భారతదేశంలో బ్రాహ్మణాధిపత్యం వల్ల దీనిని మరుగన పడవేయటం జరిగింది. అంజన్ మహరాజ్ కోలి కూతురు మహామాయాదేవి కుమారుడే సామ్రాట్ నుండి సాధువుగా మారిన గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్దుడు స్థాపించిన భౌద్ధమతం 40 దేశాలలో విస్తారంగా వ్యాపించినప్పటికీ తన జన్మస్థలంలో ఆదరణ పొందలేక పోవడం వెనుక బ్రాహ్మణీకరణ హస్తం వున్నదనడంలో ఎటువంటి సందేహం లేదు. అప్పటి నుండి ప్రారంభమైన అణచివేత ఇప్పటి వరకు నిరంతరం విలయతాండవం చేస్తుంది. దీనిని అర్థం చేసుకోవాల్సిన అవసరం వుంది. అక్కడ ప్రారంభమైన కోలి సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలో విస్తరించి, రామేశ్వరం ద్వారా దక్షిణ భార తదేశంలో ముత్తరియార్, అరయార్ రూపంలో తమిళనాడు, కేరళలో విస్తరించింది. ముత్తరియార్‌లు స్థాపించిందే చోళ సామ్రాజ్యం. దీని వారసులు కాకతీయులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో విస్తరించారు. చెరువులను తవ్వించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన కాకతీయ వారసులే ముదిరాజులు.
రాజ్యాధికారంలో మనమెక్కడ?
ముదిరాజులు అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం గు జరాత్. అక్కడ వీరి జనాభా 24%. బలమైన నాయకత్వం, ఆత్మగౌరవంతో బతకాలన్న బలమైన కోరిక, జాతి నాయకులను గౌరవించుకోవాలనే స్పృహ వుండటం వల్ల గుజరాత్ అసెంబ్లీలో 28 మంది ఎమ్మెల్యేలు, నలుగురు మంత్రులు, ఆరుగురు పార్లమెంట్ సభ్యులను ఉండేటట్లు చేసింది. కోలీలకు ప్రాధాన్యత లేని ఏ పార్టీకూడా మనుగడ సాగించలేకపోయింది. చిన్న రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లో 1 ఎమ్మెల్యే, 1 మంత్రి, 1 పార్లమెంట్ సభ్యుడు వుండటం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందిన కోలీ జాతి దర్శనమిస్తుంది.
ముదిరాజ్‌లు అత్యధికంగా కలిగిన రెండవ రాష్ట్రం తమిళనాడు. ఇక్కడ అయిదుగురు ఎమ్మెల్యేలు, ఒక మంత్రి, 1 పార్లమెంట్ సభ్యుడు వుండటం జనాభా దామాషా ప్రకారం రాజ్యాధికారం లేనప్పటికీ ఫర్వాలేదనే స్థితి ఏర్పడింది. అయినప్పటికీ తమిళనాడును పరిపాలించిన ముతరియారులు తమ పూర్వ వైభవాన్ని సంపాదించడానికి అక్కడ కె.కె. సెల్వన్ అనే జాతి నాయకుడు తన ప్రాణాలకు తెగించి నిస్వార్థంతో నిరంతరం కృషి చేస్తూ వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాట డా నికి ఏకతాటిపైకి తీసుకురావడం జరిగింది. ఆ తెగువ, అంకితభావాన్ని ముదిరాజ్ యువత అలవర్చుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా వుంది.
ఉత్తరప్రదేశ్‌లో ముదిరాజ్‌లను ‘కోరీ’ పేరుతో పిలుస్తారు. ఇక్కడ 1 మహిళా మంత్రి, 1 పార్లమెంట్ సభ్యు డు, అయిదుగురు ఎమ్మెల్యేలు జాతికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజస్థాన్‌లో 1 మహిళామంత్రి, 1 పార్లమెంట్ సభ్యుడు, అయిదుగురు ఎమ్మెల్యేలు ప్రాతి నిధ్యం వహిస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాలలో గతంలో ఇంతకంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగి వున్నప్పటికి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం జాతిని నిర్లక్ష్యం చేయ టం వల్ల రాజకీయ ప్రాముఖ్యం తగ్గిందని చరిత్ర చెబుతుంది. మహారాష్ట్రలో చారిత్రక ముంబాయిని నిర్మిం చిన ‘కోలీ’లు తగినంత స్థాయిలో రాజ్యాధికారంలో లేకపోయినా ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసే స్థితిలో వున్నా రు. అయినప్పటికీ నలుగురు ఎమ్యెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చిన్న రాష్ట్రమైన కేరళలో ఇద్దరు ఎమ్మెల్యేలు వున్నా ఎప్పడూ మనకు, ముస్లింలకు మధ్య గొడవలో చితికి పోతున్నారు. దీనిని గమనించిన యువత ఏకతాటిపైకి వచ్చి జాతి సంరక్షణకై పోరాటం చేస్తున్నారు.
కర్ణాటకలో ‘కోలీ’లు బీసీ లో వున్నా అక్కడ ఐక్యత నలుగురు ఎమ్మెల్యేలు, ఒక మంత్రి సహకారంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కోలీలను ఎస్‌టీలోకి మార్చే విధంగా ప్రభుత్వంతో తీర్మానం చేయించగలిగారు. ఉత్తర ఈశాన్య రాష్ట్రాల్లో కూడా గతంలో అస్సాం నుండి పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం ఉండేది. ఇప్పుడు 7 ఈశాన్య రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మధ్యప్రదేశ్‌లో గతంలో ఎక్కువ ప్రాధాన్యత వుండి, ‘అఖిల భారత కోలి సమాజ్’ జాతీయ అధ్యక్షుడు వున్న ప్పటికీ ఇప్పుడు ఇద్దరు ఎమ్యెల్యేలకు పరిమితమైనం. ఆంధ్రప్రదేశ్‌లో ముదిరాజు నాయకత్వ సోమరితనం, అవగాహన లేమి, నియంతృత్వ ధోరణివల్ల వారు దయనీయ పరిస్థితిలో బతుకుతున్నారు. ఏ రాజకీయ పార్టీకూడా ముదిరాజ్‌లను గుర్తించే పరిస్థితుల్లో లేదు. ముదిరాజ్‌లలో 3వ అతిపెద్ద రాష్ట్రమైన తెలంగాణలో జనాభా 14% వున్నప్పటికీ విద్య, ఉపాధి అవకాశాలలో 1% కంటే తక్కువగా వుండటం, పేదరికం, గుడుంబా చావులు, రైతు ఆత్మహత్యల్లో ప్రథమ స్థానం సంపాదించామని చెప్పుకోవటానికి, రాసుకోవటానికి సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తెలంగాణలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఒక్క జిల్లాకు కూడా ముదిరాజును అధ్యక్షుడుగా నియమించ లేదం టే ఆ పార్టీలు మనల్ని ఏ దృష్టితో చూస్తున్నాయో ముదిరాజ్ యువత నిశిత దృష్టితో ఆలోచించాల్సిన అవసరం వుంది. ఒక్క నామినేటెడ్ పదవి లేదు. మన చిరకాల సమస్య అయిన బీసీ నుండి బీసీd లోకి మార్చిన జీవో నెం. 15 అమలు విషయంలో ప్రభుత్వం నుండి స్పందన లేదు. ముదిరాజ్‌లపై ఈ రకమైన అణచివేత దోరణి లాంటి అంశాలు ఇలానే కొనసాగితే జాతి భవిష్యత్తులో అంతరించిపోయే ప్రమాదం వుంది. ఇంత పెద్ద జనాభాకు ఒక్క ఎమ్మెల్యేనే మంత్రిగా వుండటం కొంత ఊరట నిచ్చినా మనందరి సమస్యల ఒత్తిడి ఆ ఒక్కరిపై ఎంతో ప్రభావం చూపి, ఆయన మనుడగడకు ప్రమాదం సంభవించే అవకాశాన్ని కొట్టి పారేయలేం. ఈ సమస్యలకు పరిష్కారం జాతి ఏకతాటిపై రావటం, నాయకత్వాన్ని బలపర్చటం, గౌర వించటం, మంత్రి శక్తిని పెంచే విధంగా యువత ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా వుంది.
పల్లెబోయిన అశోక్
ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ముదిరాజ్ మహాసభ






