13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

వీధి కుక్కలకు వింత చర్మవ్యాధి

03-01-2026 12:00 AM

ఎర్రుపాలెం, జనవరి 2 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామంలో పలు  వీధి కుక్కలకు గత మూడు నెలలుగా వింత చర్మ వ్యాధి సోకి చర్మంపై బొబ్బర్లు వచ్చి ఆ వ్యాధికి క్షీణించి మృతి చెందుతున్నాయి. అయితే ఆ కుక్కలు వ్యాధి సోకిన తర్వాత గ్రామం సమీపంలోని కాలవల్లో, వాగుల్లో, మురికిగుంటల్లో దిగి నీళ్లు తాగటం నీళ్లల్లో దొర్లటం లాంటి పనులు చేయడం వల్ల ఆ నీటిని పశువులు నీళ్లు తాగటం, ఈత కొట్టడం, కొందరు మనుషులు బహిర్భూమికి వెళ్లి అదే వాటర్ వాడడం వల్ల పశువులకు, మనుషులకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందని ప్రకృతి వ్యవసాయ సాగు రైతు, శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఖమ్మం జిల్లా రైతుసేవా కోఆర్డినేటర్ కుడుముల వెంకటరామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ వ్యాధి సోకిన కుక్కలు జిల్లాలో పలు గ్రామాలలో సంచరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ వీధి కుక్కలు మట్టిలో దొర్లటం మురికి కాలువల్లో, వాగుల్లో దిగి నీళ్లు తాగటం ఈత కొట్టడం వల్ల మట్టిలో దొర్లే చిన్నపిల్లలకు అలాగే వాగుల్లో చేపల వేటకు వెళ్లి మనుషులకి గాని ఆ నీళ్లలో ఉన్న చేపలకు గాని ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందని నీళ్లు తాగిన పశువులకి ఈ వ్యాధి సోగితే తీవ్రస్థాయిలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవిస్తుందని వెంకట్రామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ వ్యాధి కేజెస్ వ్యాధిగా ఉందని పలువురు అనుమానంవ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గ్రామపంచాయతీ సిబ్బంది మరియు వైద్య అధికారులు స్పందించి ఈ వ్యాధి సోకిన వీధి కుక్కలను తీసివేసి, ఉన్న కుక్కలకు తగిన జాగ్రత్తలు తీసుకోవలసినదిగా కుడుముల వెంకట రామిరెడ్డి ముక్తకంఠంతో కోరుతున్నారు. ఏ వ్యాధి అయినా ప్రాథమిక దశలో నివారణ చేస్తే తప్ప వ్యాధి తీవ్రత పెరిగిన తర్వాత ఎన్ని నివారణ చర్యలు తీసుకున్న ప్రయోజనం శూన్యమని వెంకటరామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.