calender_icon.png 7 January, 2026 | 2:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పగిలిన పైప్ లైన్.. ఎగిసి పడిన నీరు

03-01-2026 12:00:00 AM

మానకొండూరు, జనవరి 2(విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం జగ్గయ్య పల్లి శివారులో హైదరాబాద్ మెట్రో వాటర్ వరక్స్( హెచ్‌ఎం డబ్ల్యూఎస్) ప్రధాన పైప్ లైన్ కు గండిపడి నీరు ఎగిసి పడింది.. రామగుండం నుండి హైదరాబాద్ కు మంచినీటిని తరలించే  ఈ మెయిన్ లైన్ మానేరు వాగు సమీపంలో పగిలిపోయింది. ఒత్తిడితో నీరు బయటకు రావడంతో సమీపంలోని విద్యుత్ వైర్లు ఉండడంతో ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు సరఫరా నిలిపివేశారు. సమాచారం అందుకున్న అధికారులు నీటి సరఫరాను నిలిపివేశారు. సంఘటన స్థలానికి చేరుకొని సిబ్బంది పైపులైనుకు మరమ్మతులు చేపట్టారు.