03-01-2026 12:00:00 AM
బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొండ హరీష్ గౌడ్
హుజూర్ నగర్, జనవరి 2: మున్సిపల్ ఎన్నికల ఓటరు జాబితా తప్పులు లేకుండా విడుదల చేయాలని బిజెపి పట్టణ అధ్యక్షుడు కొండ హరీష్ గౌడ్ అన్నారు.హుజూర్ నగర్ మున్సిపల్ వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితా సవరణ గురించి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసి మాట్లాడారు... పట్టణంలోని పలు వార్డులలో నివసిస్తున్న
జనాభాను సర్వే నిర్వహించి పాత మ్యాపింగ్ ప్రకారం వార్డుల వారీగా జాబితాను ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి గుండా గోపి, కొప్పెర సాయి, చుక్క హరీష్, తదితరులు, పాల్గొన్నారు.