11 March, 2026 | 12:17 AM

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రతకు పటిష్ట చర్యలు

09-03-2026 05:06 PM

జిల్లా కలెక్టర్ కె. హరిత

కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఎన్నికలలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను భద్ర పర్చిన గోదాo వద్ద పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె. హరిత అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఈవిఎం బద్ర పర్చిన గోదాంను అదనపు కలెక్టర్ రెవెన్యు ఎం.డెవిడ్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిదులతో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగ కలెక్టర్ మాట్లాడుతూ... గోదాం వద్ద 24గంటల పాటు పోలిస్ బందోబస్తు కల్పించడం జరుగుతుందని 24గంటల పాటు సి సి కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమములో ఎన్నికల విభాగం అధికారులు శ్యాంలాల్, ముసాఫిర్ హుస్సేన్,వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.