10 March, 2026 | 9:00 PM

అర్జీలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు

09-03-2026 05:02 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించి ప్రజావాణిలో వచ్చిన అర్జీలను నిర్లక్ష్యం చేయవద్దని రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను స్వీకరించిన అదనపు కలెక్టర్లు వాటిని వెంటనే పరిష్కరించాలని అక్కడే ఉన్న అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.