03-12-2025 12:08:44 AM
ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి, ఎస్సై బొజ్జ మహేష్
ఎల్లారెడ్డి, డిసెంబర్ 2: (విజయ క్రాంతి) : ప్రజలకు సేవలు అందించడానికి 24 గంటలు పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్నారని ప్రజలకు సమస్యలు వస్తే ముందుండే పోలీసుల పట్ల కొందరు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించడం సరికాదని, అనవసరంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవ ని ఎల్లారెడ్డి సిఐ రాజారెడ్డి ఎస్త్స్ర మహేష్ అన్నారు.
ఎల్లారెడ్డి ఎస్‌ఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ఇనాంధార్ కాలనీలో నివసించే రేష్మ అనే మహిళ తన భర్త నజీమ్ తరచుగా మద్యం సేవించి తనను రోజు వేధిస్తుండడంతో సోమవారం రాత్రి తొమ్మిది గంటల 40 నిమిషాలకు 100 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందజేయడంతో, సమాచారం అందుకున్న ఎల్లారెడ్డి పోలీస్ కానిస్టేబుల్ కే సాయికిరణ్ ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అర్థం చేసుకొని రేష్మ భర్త నజీమ్ ను శాంతింప చేయడానికి ప్రయత్నించగా నజీమ్ ఆగ్రహంతో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ కే సాయికిరణ్ పై ఇంట్లో ఉన్న, కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించాడు.
వెంటనే కానిస్టేబుల్ సాయికిరణ్ అక్కడి నుండి తప్పించుకోవడం పోలీస్ స్టేషన్కు రావడంతో విషయం ఎల్లారెడ్డి ఎస్‌ఐ సిఐ లకు సమాచారం అందించడంతో వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దురు సుగా ప్రవర్తించిన నజీమ్ను పోలీస్ ఆధీనంలోకి తీసుకొని రిమాండ్ కు తరలించినట్లు ఎస్త్స్ర మహేష్ తెలిపారు. అనంతరం సిఐ మాట్లాడుతూ విధుల్లో ఉన్న పోలీస్ అధికారులపై ఎవరైనా అనవసరంగా దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.