calender_icon.png 3 December, 2025 | 12:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

3లక్షల 51వేల టన్నుల చెత్త బయోమెట్రిక్ ద్వారా వినియోగంలోకి

03-12-2025 12:10:43 AM

పరిశ్రమలకు ముడి సరుకు, ఇంధనంగా తయారీ

నిజామాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ పరిధిలోని నాగారం డంపింగ్ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ  తన ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం, నిజామాబాద్ నగర శివారులోని డంపింగ్ యార్డ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు మంగళవారం  డంపింగ్ యార్డ్ సందర్శించారు.

బయో-మైనింగ్ ద్వారా పరిసరాలు శుభ్రపరిచే పనులు వేగంగా కొనసాగడం చూసి ఆయన సంత ృప్తి వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డుల్లో పేరుకుపోయిన చెత్త వల్ల పరిసరాలకు పర్యావరణానికి సమస్యలు పడతాయని. యాడ్ లోని చెత్తను తొలగించడానికి బయో-మైనింగ్ పద్ధతి ఉపయోగిస్తు న్నారన్నారు. దీనివల్ల పాత చెత్తను వేరు చేసి, శుభ్రపరచి, భూమిని తిరిగి ఉపయోగించుకునేలా చేపట్టారు.

ముందుగా డంపింగ్ యార్డ్ లోని చెత్తపై ప్రత్యేక ద్రావణం పిచికారీ చేసి దుర్గంధం వెలువడకుండా చర్యలు తీసుకుంటారు. తర్వాత ట్రమ్మెల్ యంత్రం ద్వారా చెత్తను మూడు భాగాలుగా వేరు చేసి-ఎరు వుగా ఉపయోగించే భాగం, కట్టడ పనులకు పనికొచ్చే భాగం, పరిశ్రమలకు గుడి సరుకుగా పనికొచ్చే  ఇంధనంగా ఉపయోగించే ఆర్ డి ఎఫ్ ద్వారా పనులు ప్రారంభించారు అని ఎమ్మెల్యే తెలిపారు.

మొత్తం 3,51,500 మెట్రిక్ టన్నుల చెత్తను శుద్ధి చేసే ప్రక్రియ త్వరలోనే పూర్తి అవుతుందని ఎమ్మెల్యేకు  అధికారులు వివరించారు. ప్రస్తుతం 2 మిషిన్లు పనిచేస్తుండగా, అదనంగా మరో 2 మిషిన్లు అవసరం పడతాయి అవి త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. ఈ చర్యలతో డంపింగ్ యాడ్ ప్రాంతం శుభ్రపడి, నాగా రం డంపింగ్ యార్డ్ సమస్యతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా శాశ్వత పరిష్కారం లభించనున్నద  తెలిపారు. శుభ్రమైన, ఆరోగ్యకరమైన ఇందూర్ నా  లక్ష్యం - ఆ దిశగా పనులు వేగంగా జరుగుతున్నాయి.