గురుకులాల్లో సకల సదుపాయాలు
19-06-2024 12:49 AM
- నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
నిర్మల్ జూన్18 (విజయక్రాంతి): గురుకులాలు, కస్తూర్బా విద్యాలయాల్లో సకల సదుపాయాలు ఉన్నాయని, విద్యార్థులకు అక్కడ నాణ్యమైన విద్య అందుతుందని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్‌లోని సోఫినగర్ గురుకుల పాఠశాల, సోన్, అర్బన్ కస్తూర్బా విద్యాలయాలను మంగళవారం ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాలయాల్లో పలు రికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సదుపా యాలపై సిబ్బందిని ఆరా తీశారు. పర్యటనలో ఉపాధ్యాయులు కల్పన రోహిణి, మేరీ, శీనా, లత, సుజాత ఉన్నారు.






